- ఉపాధి కూలీల నిరసన
సారథి న్యూస్, నర్సాపూర్: ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన 242 మంది ఉపాధి కూలీలు కౌడిపల్లి ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం ఎంపీడీవో కోటిలింగం, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్ కు తమ సమస్యలను విన్నవించారు.