సారథి న్యూస్, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా భౌతిక దాడులు చేశారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్, రాజు నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- July 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GANDIPALLY
- HUSNABAD
- KAPURNAIK TAND
- MPTC
- ఎంపీటీసీ
- ఏసీపీ
- హుస్నాబాద్
- Comments Off on కులంపేరుతో దాడి