– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్
సారథి న్యూస్, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం హమాలీ కార్మికులకు మాస్క్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉమ్మెతుల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేష్, జిల్లా నాయకులు గంటే రాజేశం, నాయకులు ఏగుర్ల మల్లేశం, ముత్యం ఆంజనేయులు గౌడ్, సాయిలు, మల్లేశం పాల్గొన్నారు.