సారథి న్యూస్ ,దుబ్బాక: దుబ్బాక పట్టణంలో గురువారం చేనేత కార్మికుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలేష్ గౌడ్, రాజిరెడ్డి, రోశయ్య, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్ గౌడ్, భాను పాల్గొన్నారు.
- April 23, 2020
- లోకల్ న్యూస్
- BJP
- కరోనా
- దుబ్బాక
- బీజేపీ
- రఘునందర్రావు
- సరుకులు
- Comments Off on కార్మికులకు అండగా ఉంటాం