సారథి న్యూస్, రామగుండం: ప్రకాశం జిల్లా కారంచేడు అగ్రవర్ణాల నరమేధానికి 35 ఏళ్లు గడిచిపోయిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు అన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో కారంచేడు మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదిగ కులస్తులను ఉచకోత కోసి అగ్రవర్ణాలు నరమేధం సృష్టించాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అగ్రవర్ణ పార్టీల్లో కొందరు దళిత నాయకులు పాలేరులుగా పనిచేస్తున్నందున కారంచేడు బాధితులకు సరైన న్యాయం జరగలేదన్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలోనూ జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మైస రాజేష్, కొంకటి లక్ష్మణ్, కాంపెళ్లి సతీష్, మంతెన లింగయ్య. పోగుల రంగయ్య. శనిగరపు రామస్వామి, దుబాసి బొందయ్య, గద్దల శశిభూషణ్ పాల్గొన్నారు.