Breaking News

కల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: జాతీయ ఉపాధిహామీ పథకం కింద తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకొనేందుకు చిన్న, సన్నకారు రైతులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ సూచించారు. స్థానిక ఎంపీడీవో, ఏఈవో, పంచాయతీ సెక్రటరీ దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్‌ కాస్ట్‌ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, జనరల్‌ రైతులకు యూనిట్‌ కాస్ట్‌ 10 శాతం డబ్బులు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా కల్లాలు నిర్మిస్తారన్నారు. స్వయం సహాయక బృందాల్లో ఉన్న వారు, ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉన్న రైతులు అర్హులన్నారు. రైతులు ముందుగా సొంత ఖర్చులతో సూచించిన కొలతలు, నియమాలతో కల్లాలు నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రెండు విడుతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు.