- యువ యాంకర్ ప్రేక్షమెహతా సూసైడ్
మంచి భవిష్యత్ ఉన్న ఫ్యామస్ యాంకర్ హోస్ట్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ జాతీయ టెలివిజన్ రంగంలో విషాదం నింపింది. గత రాత్రి ప్రేక్షమెహతా అనే యువ యాంకర్ ఆత్మహత్య చేసుకోవడం హిందీ వినోదరంగంలో కలకలం సృష్టించింది. మరణానికి ముందు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మరింత సంచలనాన్ని సృష్టించింది. బాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందిన ప్రేక్షమెహతా అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. పలు క్రైం ఎంటర్ టైన్ మెంట్ షోలకు హోస్ట్ గా యాంకర్ గా కూడా పనిచేసింది.
ఫేమస్ యాంకర్ గా మారిన ప్రేక్షమెహతా ఇండోర్ పట్టణంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం చిత్రపరిశ్రమలో తీవ్రవిషాదం నింపింది. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపి..అంతా నిద్రపోయాక సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దానికి ముందు చివరిసారి తన సెల్ఫీ తీసుకుని ఫొటోతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో ‘కలలు అంతమయ్యాయి.. జీవితంలో ఇవి చెడుదినాలు’ అంటూ బాధను వ్యక్తం చేస్తూ ఎమోషన్ పోస్టు పెట్టింది. తాజాగా కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ మూతపడడంతో ముంబై నుంచి ఇండోర్ వచ్చింది. ఇది ఆమె ఆదాయంపై తీవ్రప్రభావం చూపడం.. వేరే పని దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైందని.. మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం.