బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్ ఎగ్జామ్స్ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్ చేతిలో చూసినా శానిటైజర్, మాస్క్‌లే కనిపించాయి. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది.
‘పదో తరగతి అనేది విద్యార్థుల జీవితంలో ఒక మైలు రాయి. పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అందరితో సంప్రదింపులు జరిపి పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో హైకోర్టుకు ఎస్ వోపీ కూడా ఇచ్చాం’అని కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేశ్ కుమార్ చెప్పారు. ఒక్కో క్లాసులో కేవలం 18 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. పెద్ద క్లాస్ రూమ్‌లో అయితే 20 మందిని అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి స్టూడెంట్‌కి కచ్చితంగా టెంపరేచర్ టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నట్లు వెల్లడించారు.