సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనా వైరస్ నాకు రాదని, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నానని, పొరపాటున కూడా అనుకోవద్దని’ ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. శుక్రవారం నగరంలోని రాజ్ విహార్, ఆర్‌ఎస్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్క్ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్దూరం పాటించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్ లేకుండా తిరిగే బైక్లు, ఆటోలు, ఇతర వాహనాల యజమానులకు తప్పనిసరిగా ఫైన్వేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాసమూర్తి, సిబ్బంది ఉన్నారు.
- June 26, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CARONA
- DSP
- TRAFFIC
- కరోనా
- కర్నూలు
- Comments Off on కరోనా రాదని.. అనుకోవద్దు