సారథి న్యూస్, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ వేణుమాధవ్, ఎస్సై ఉదయ్ కుమార్, తహసీల్దార్ సైదులు, ఎండీవో శంకర్, ఈవోఆర్డీ రాజారావు ఉన్నారు.
- May 19, 2020
- ఖమ్మం
- షార్ట్ న్యూస్
- CAROONA
- KHAMMAM
- గాంధీ ఆస్పత్రి
- జడ్పీ చైర్మన్
- లింగాల కమల్ రాజ్
- Comments Off on కరోనా.. భయం వద్దు