- ఆవిష్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పెద్దసంఖ్యలో టెస్టింగ్ లు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును రూపొందించింది.
ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్యఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ శనివారం ఆవిష్కరించారు.
బస్సులోనే టెస్టింగ్స్
కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును అన్ని ఎక్విప్ మెంట్స్ తో కూడిన టెస్టింగ్ ల్యాబ్ గా తయారుచేశారు. ఈ బస్సులో ఎక్స్ రే ఎగ్జామినేషన్ ఫెసిలిటీని కూడా కల్పించారు. అవసరమైన మిగతా ఎక్విప్ మెంట్స్ ను త్వరలో చేర్చనున్నారు. టెస్టుల నిర్వహణకు బస్సులో ఓ చిన్న చాంబర్ ను ఏర్పాటు చేశారు.
‘కరోనా టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన తొలిబస్సు ఇదేనని బీఎంసీ అధికారులు చెప్పారు. కరోనా వైరస్ ను గుర్తించడానికి ఓ2 శాట్యురేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్ రే తదితర సౌకర్యాలు ఉన్నాయి.