అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి..
సారథి న్యూస్, అలంపూర్: అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం లోకకల్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మరి నుంచి దేశప్రజలంతా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు వేదపండితులు మహాసంకల్పం చేశారు. దేవీ సప్తశతి పారాయణాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన చండీహోమం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు భక్తులను ఎవరినీ అనుమతించలేదని ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆలయ ముఖ్య అర్చకుడు డి.ఆనంద్‌కుమార్ శర్మ అన్ని క్రతువులను దగ్గరుండి జరిపించారు.
Good coverage
Good coverage సారథి న్యూస్