సారథి న్యూస్, మహబూబ్‌నగర్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను పక్కాగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా క్లస్టర్ ప్రాంతాల్లోని ప్రజల కదలికలపై పెట్రోలింగ్ పోలీసులు, నిఘా బృందాలు, స్థానికంగా పికెట్ లో ఉన్న సిబ్బందితో పాటు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతోనే ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు నమోదుకావడం లేదన్నారు. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కరోనా భూతం మన కుటుంబాన్ని, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందన్న విషయాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఈ విషయం గట్టిగా గుర్తుంచుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు.
- April 20, 2020
- Top News
- లోకల్ న్యూస్
- మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి
- Comments Off on కరోనాపై అప్రమత్తం