వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రబలకుండా వెంటనే చనిపోయేందుకు ఉపయోగపడే ‘క్యాచ్ అండ్ కిల్’ ఎయిర్‌ఫిల్టర్‌ను కనిపెట్టినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే చాన్స్ చాలా వరకు తగ్గుతుందన్నారు. విమానాలు, స్కూళ్లు, ఆఫీసుల్లో వీటిని అమర్చుకోవచ్చన్నారు. మెటీరియల్స్ టుడే ఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ద్వారా ఇది వెల్లడైంది. కరోనా వైరస్ ఒక్కసారి ఈ ఫిల్టర్ ద్వారా వెళ్తే వెంటనే చచ్చిపోతోందని, 99.8 శాతం ఇది నిజమైందని సైంటిస్టులు చెప్పారు. నిక్కెల్ ఫోమ్ హీటెడ్‌ని ఉపయోగించామని, 200 సెల్సియస్ వేది అయ్యేలా దీన్ని తయారుచేశామని నిపుణులు చెప్పారు.
‘ఎయిర్‌పోర్ట్స్, ఫ్లైట్స్, స్కూళ్లు, ఆఫీసు బిల్డింగ్స్, షిప్స్ తదితర చోట్ల దీన్ని ఉపయోగించవచ్చు. ఇది వైరస్ వ్యాప్తిని అరికడుతుంది.’ అని యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ కి చెందిన కో– ఆథర్ ఆఫ్ స్టడీ రెన్ చెప్పారు. ఈ వైరస్ గాలిలో దాదాపు మూడు గంటల వరకు ఉంటుందనే విషయంపై సైంటిస్టులు ప్రకటన చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ ఫిల్టర్స్ దాన్ని వెంటనే చంపేసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఫిల్టర్‌కు 200 డిగ్రీ సెల్సియస్ హీట్ ఉన్న నేపథ్యంలో టెంపరేచర్ వల్ల వైరస్ చచ్చిపోతుందన్నారు.