సారథి న్యూస్, నర్సాపూర్:
కరోనా వ్యాధికి కులం, మతం, రంగు, పేద అనే తేడా లేకుండా ఎవరికైనా సోకవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం కౌడిపల్లి లక్ష్మీ నరసింహగార్డెన్ లో 420 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. లాక్ డౌన్ వేళ ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడకూడదని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఆటో డ్రైవర్ల ఫైనాన్స్ లోన్ బ్యాంకు రుణాల్లో వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఖాళీగా ఉండకుండా ఉపాధి హామీ పనులు చేసుకుంటే తప్పు లేదని, అంతేకాకుండా ఉపాధి హామీ పనుల్లో వచ్చిన డబ్బులతో పూట గడుస్తుందని ప్రజలకు సూచించారు. అనంతరం కొల్చారంలోని జైన మందిరంలో 200 మంది ఆటో డ్రైవర్లకు మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి సరుకులు పంపిణీ చేశారు.
యూత్ రక్తదానం
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 15 మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, హెచ్ సి డాక్టర్ వెంకట స్వామి,కౌడి పల్లి సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.