సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- November 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DEGULVADI
- KANGTI
- NARAYANAKHED
- TRANSCO
- కంగ్టి
- ట్రాన్స్కో
- దెగుల్ వాడీ
- నారాయణఖేడ్
- Comments Off on కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు