Breaking News

కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

సారథి న్యూస్​, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు.

జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్​ మెంట్​ జోన్ వివరాలను మంత్రికి తెలిపారు. 18 గ్రామాలను కంటైన్​ మెంట్​ జోన్​గా చేశామని వివరించారు. ప్రతి ఇంటిని సర్వే చేస్తూ నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. కంటైన్​ మెంట్​ జోన్లలోకి బంధువులు, స్నేహితులు ఎవరు రాకపోకలు సాగించకూడదని సూచించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. వారి వెంట కోవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి ఎంఎం.నాయక్, ఎస్పీ ఆర్ఎన్.అమ్మిరెడ్డి, పాలకొండ ఆర్డీవో టీవీఎస్​ కుమార్​, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.