- కాంగ్రెస్ లీడర్లపై టీఆర్ఎస్ నేతల ఫైర్
సారథి న్యూస్, హుస్నాబాద్: రైతులపై కాంగ్రెస్ లీడర్లు ముసలి కన్నీరు కారుస్తున్నారని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం విస్తీర్ణం పెంచడమే కాకుండా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెరువులు కుంటలు నింపితే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు తట్టెడుమట్టి పోయలేదని విమర్శించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి తమ ఉనికి కోసం పాకులాడుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నాయకులను విమర్శించే నైతికహక్కు వారికి లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, ఎంపీపీ లక్ష్మి, అన్వర్, కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీ బీలునాయక్, ఎంపీపీ వెంకట్ పాల్గొన్నారు.