లండన్: ఆటలోనే కాదు.. ఆదాయం సంపాదనలోనూ క్రికెట్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఫోర్బ్స్ రిచ్చెస్ట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించిన విరాట్.. మరో ఘనతను కూడా సాధించాడు. లాక్డౌన్ కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 12 నుంచి మే 14వ తేదీ వరకు సేకరించిన డాటా ప్రకారం విరాట్ ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో స్పాన్సర్డ్ పోస్ట్‌ల ద్వారా కోహ్లీ రూ.3.63కోట్లు సంపాదించాడు. అంటే ఒక్క పోస్ట్ విలువ రూ.1.21కోట్లు అన్నమాట.
పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రూ.17.24 కోట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనాసూపర్స్టార్ లియోనల్ మెస్సీ(రూ.11.5 కోట్లు), నెయ్మార్ (రూ.10.53కోట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బాస్కెట్‌బాల్ గ్రేట్ షాక్విలి ఓ నీల్ (రూ.5.58 కోట్లు), ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్(రూ.3.88కోట్లు)టాప్–5లో నిలిచారు.