లాక్ డౌన్ వల్ల కొంతమంది పెళ్లిళ్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, ఏ మాత్రం ఆర్భాటం లేకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ద మోస్ట్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఎయిర్ హోస్టెస్ ను తన కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటే.. అతి తక్కువ మంది బంధువులతో నిఖిల్ సిద్దార్థ్ కూడా తన లవర్ పల్లవిని పెళ్లాడాడు.
కానీ ఇంతకు ముందు నుంచీ హీరో నితిన్ తన గర్ల్ ఫ్రెండ్ షాలితో లవ్‌లో ఉన్నాడని, దుబాయ్ లో ఏప్రిల్ 16న వారి పెళ్లి అంటూ వార్తలు సందడి చేశాయి. అవి కాస్తా సందడిగానే మిగిలి నితిన్ పెళ్లి వాయిదా పడుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో రానా కూడా బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నానని తన ప్రేయసి మిహికా బజాజ్ తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసి హడావుడి చేశాడు. ఇప్పుడీ ఇద్దరి హీరోల పెళ్లిళ్లు ఒక్కసారే జరగతాయోమోనని అంటున్నారు అభిమానులు. మరీ ఈ ఏడాది ఎండింగ్ లోనైనా ఈ బ్యాచిలర్స్ ఇద్దరూ ఒక్కటవుతారేమో వేచిచూద్దాం.