Breaking News

ఐదుగురు క్రికెటర్లకు ‘నాడా’ నోటీసులు

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్​ ప్లేయర్​ చతేశ్వర్​ పుజారా, కేఎల్​ రాహుల్​, స్పిన్నర్​ రవీంద్ర జడేజాతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మందన, దీప్తిశర్మకు.. జాతీయ డోపింగ్​ సంస్థ (నాడా) నోటీసులు జారీచేసింది. ‘ఎప్పుడు, ఎక్కడ’ అనే క్లాజ్​ను ఉల్లంఘించినందుకు నాడా చర్యలు చేపట్టింది. రాబోయే మూడు నెలలు ఎక్కడ ఉంటారో.. ముందుగానే నాడాకు తెలియజేయడమే ఈ క్లాజ్​ ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొత్తం 110 మంది అథ్లెట్లు నాడా రిజిస్టర్​ టెస్టింగ్​ పూల్​ కింద నమోదై ఉన్నారు.

వీళ్లంతా ఈ క్లాజ్​ను కచ్చితంగా పాటించాల్సిందే. అయితే పాస్​వర్డ్​ సమస్య వల్లే క్రికెటర్లు ఈ ఫారాన్ని సకాలంలో అందజేయలేకపోయారని బీసీసీఐ వెల్లడించింది. ఇందులో కావాలని చేసిన తప్పిదం లేదని చెప్పింది. అయితే బీసీసీఐ ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నామని నాడా డైరెక్టర్​ జనరల్​ నవీన్​ అగర్వాల్​ తెలిపారు. ఈ క్లాజ్​కు సంబంధించిన ఫారాన్ని రెండు రకాలుగా సమర్పించవచ్చన్నారు. అథ్లెట్​, లేదా అసోసియేషన్లు ఈ ఫారాన్ని దాఖలు చేయొచ్చని అగర్వాల్​ స్పష్టం చేశారు.