సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు ఫైనల్ చేయాలని ఏఈ నవీన్ ను కోరాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.20 లక్షలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ రమేష్ నగదు ఇస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ వద్ద పట్టుబడ్డ రూ.1.20ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
- July 6, 2020
- Archive
- క్రైమ్
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- AE
- BHADRADRI
- IRRIGATION
- KOTHAGUDEM
- నీటిపారుదల శాఖ
- లంచం
- Comments Off on ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ