సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,525కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 33 మరణాలు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
కరోనా నుంచి కోలుకుని 441 మంది డిశ్చార్జ్ కాగా, 1,051 మంది కరోనా వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కర్నూలులో కొత్తగా 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో ఆరు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో నాలుగు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.