సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ కార్టర్స్లో ఎస్పీ సునీల్ దత్ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాలోత్ కవిత. కోరం కనకయ్య. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కాజీ పురంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రమణారెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కిష్టయ్య, అడ్మిన్ ఆర్ఐ కృష్ణ, ఎంటీవో సోములు,హోంగార్డ్స్ ఇంచార్జి ఆర్ఐ దామోదర్, టీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, నాగేశ్వరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఫర్జానా బేగం రహీం, మధిర సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్, కరివేద సుధాకర్, సిరిపురం మాజీ సర్పంచ్ చావా వేణు తదితరులు పాల్గొన్నారు.
- June 26, 2020
- Archive
- ఖమ్మం
- AJAY
- HARITHAHARAM
- KOTHAGUDEM
- MINISTER
- భద్రాద్రి కొత్తగూడెం
- హరితహారం
- Comments Off on ఊరూరా హరితపండుగ