Breaking News

ఉమ్మి, చెమట వాడొద్దు

ఉమ్మి, చెమట వాడొద్దు

క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్​ లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. మ్యాచ్​ లో బంతిని షైన్ చేసేందుకు గతంలో క్రికెటర్లు ఉమ్మి, చెమటను వాడేవారు. కానీ ఇప్పుడు ఈ రెండింటిని వాడకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించనుంది. ఉమ్మి, చెమట వల్ల కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. బంతిని షైన్ చేసేందుకు ఆర్టిఫిషియల్​ గా విధానాలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది.

ఐసీసీ కూడా ఇదే తరహా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే మెడికల్ నిపుణులు, క్రీడాసంఘాలు, ప్రభుత్వ సలహాలు, సూచనలతో ఆస్ట్రేలియన్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఏఐఏస్) కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. డ్రెస్సింగ్ రూములు, గ్రౌండ్స్, మీటింగ్ హాల్స్, ట్రైనింగ్​ సెషన్స్​ లో ఫిజికల్ డిస్టెన్స్​ కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేయనుంది. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలను మూడుదశల్లో అమలుచేయనుంది.