Breaking News

‘ఉపాధిహామీ’ ఎంతో ఉపయోగం

మహబూబాబాద్: ఉపాధిపనులతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబాబాద్​ కలెక్టర్​ ఏపీ గౌతం పేర్కొన్నారు. గురువారం కేసముద్రం మండలం గాంధీనగర్, కలవల గ్రామాలలో (ఎస్ ఆర్ ఎస్ పి) శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కాలువలను సందర్శించి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం నిధులతో కాలువల్లో పూడికలు, చెరువు పూడిక వంటి పనులను చేపట్టి రైతులకు సాగునీరందించాలన్నారు. అంతకుముందు ఆయన మహబూబాబాద్​లో పర్యటించారు. రోడ్లపై ఎవరైనా వాహనాలు నింపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఈఈ ఎం వెంకటేశ్వర్లు, డీఈ విజయ్ బాబు, తాసిల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ చంద్ర మోహన్, సర్పంచ్ సంజీవరెడ్డి ఎంపీటీసీ అశోక్ రెడ్డి, ఎస్సారెస్పీ అధికారులు కుమారస్వామి అలేఖ్య సామ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.