సారథి న్యూస్, రామడుగు: నీళ్లు ,నిధులు, నియామకాలు, స్వపరిపాలన కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఎటుపోయాయని తెలుగు యువత కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు జెల్లోజి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడుతాయని ఆశపడ్డామని అదేమీ జరగలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీపోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
- June 7, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- TDP
- TULUGU YOUTH
- తెలంగాణ
- తెలుగు యువత
- Comments Off on ఉద్యోగాలు భర్తీ చేయాలి