సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు పాల్గొన్నారు.
- June 2, 2020
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CM KCR
- TELANGANA
- భద్రాద్రి కొత్తగూడెం
- వనమా
- Comments Off on ఇక తెలంగాణ సస్యశ్యామలం