Breaking News

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్​ వీరపాండియన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్​కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్​ శెట్టి మాట్లాడుతూ.. ఈ క్రాప్​నమోదు చేయాలని, జిల్లాలో ఈనెల 20 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు కౌలురైతు కార్డుల జారీపై అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్​విలేజ్‌ క్లినిక్స్‌, అంగన్​వాడీ భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో అనంతరం జేసీ2(అభివృద్ధి) రాంసుందర్‌ రెడ్డి, జేసీ3 (ఆసరా, సంక్షేమం) సయ్యద్‌ ఖాజామోహిద్దీన్‌, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.