సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్స్ లో ఉన్న ముగ్గురికి కరోనా టెస్టులో నెగిటీవ్ వచ్చిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులైన వారి రక్త నమూనాలను ఆదివారం హైదరాబాద్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించగా సోమవారం వచ్చిన రిపోర్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని వెల్లడించారు. ఆ ముగ్గురిని 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.
- May 26, 2020
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- CARONA
- NAGARKARNOOL
- కలెక్టర్
- చారకొండ
- Comments Off on ఆ ముగ్గురికి కరోనా లేదు