పెర్త్: కరోనా నేపథ్యంలో.. భారీగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో నిర్ణయం తీసుకుంది. సీఈవో కెవిన్ రాబర్ట్‌ను తొలగించిన తరహాలోనే.. బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ ను కూడా ఇంటికి సాగనంపింది. భారీ వేతనం ఇవ్వాల్సి వస్తుండటంతో.. అదనపు భారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘అంబ్రోస్, వాల్ష్ బౌలింగ్‌ను హెల్మెట్ లేకుండా ఆడటం ఎంత భయంకరగా ఉంటుందో.. కరోనాను కూడా ఎదుర్కోవడం అలాగే ఉంది. ఇప్పుడప్పుడే ఆర్థికంగా కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో.. సగానికిపైగా ఉద్యోగులను తొలగించుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. ‘హిక్ లేకపోవడం జీర్ణించుకోలేని అంశమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేలా లేదు. మంచి సమగ్రత, ఏకాగ్రతతో పని చేసే వ్యక్తి హిక్. అతనితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అతను పాటించే విలువలు, ఆటపై అతనికి ఉన్న జ్ఞానం వెల కట్టలేనిది’ అని లాంగర్ తెలిపాడు.
- June 19, 2020
- Archive
- క్రీడలు
- ASIS
- BATTING COACH
- OUT
- PERTH
- జస్టిన్ లాంగర్
- బ్యాటింగ్ కోచ్
- Comments Off on ఆసీస్ బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ పై వేటు