Breaking News

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పేద, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి అన్నారు. కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కౌన్సిలర్ లతో కలిసి 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందన్నారు. ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో బతుకమ్మ చీరలు, రంజాన్ కానుకల మాదిరిగానే క్రిస్మస్ కు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు రెండువేల పాకెట్లు జిల్లాకు వచ్చాయని, ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో గిఫ్ట్ ప్యాకెట్ లో చీర, పంజాబీ డ్రెస్ మెటీరియల్, ప్యాంటు షర్టు మెటీరియల్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.