న్యూఢిల్లీ: సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. కెప్టెన్‌గా మాత్రం విజయవంతం కాలేకపోయాడనే ఓ విమర్శ మాత్రం అలాగే ఉంది. అయితే దీనిపై చాలా మంది భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. 1983 ప్రపంచకప్ విజేత టీమ్ సభ్యుడు మదన్‌లాల్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. సారథిగా సచిన్ విఫలమయ్యాడని తాను అంగీకరించనని చెప్పాడు. ‘సచిన్ గొప్ప సారథి. కాదని ఎవరు చెప్పినా వాళ్లకు ఆటపై అవగాహన లేనట్లే. ఓ కెప్టెన్‌గా అతను వ్యక్తిగత ఆటపై ఎక్కువ దృష్టిపెట్టాడు. అదే సమయంలో ఇతర ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాడు. కాకపోతే వాళ్లు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. బాగా ఆడాలని ఎవర్ని బలవంత పెట్టలేదు. సమష్టి క్రీడ అయిన క్రికెట్లో ఒకరు ఆడితే సరిపోదు. కనీసం ఇద్దరు ముగ్గురైనా ఆడాలి. కానీ సచిన్ నాయకత్వంలో అది జరగలేదు. ఆటగాళ్ల మధ్య సమన్వయం తీసుకురావడంలో మాస్టర్ కొద్దిగా విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి, చోట కూడా చూసీ చూడనట్లుగా వదిలేశాడు. అందుకే గొప్ప సారథిగా నిలవలేకపోయాడు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు.
- June 19, 2020
- Archive
- క్రీడలు
- CAPTAIN
- FREEDOM
- MADANLAL
- SACHIN
- క్రికెట్
- మదన్‌లాల్
- Comments Off on ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే