- సిద్ధమైన వరల్డ్ ఫెడరేషన్
న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో బ్యాడ్మింటన్‌ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో బ్యాడ్మింటన్ క్రీడ మొదలుకానుంది. నవంబర్ 17–22వ తేదీ వరకు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఇండియా ఓపెన్‌కు డిసెంబర్ 8న తెరలేవనుంది.
ఓవరాల్‌గా ప్రధానమైన 8టోర్నీలను రీషెడ్యూల్ చేశారు. న్యూజిలాండ్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్, మలేసియా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్ ఇందులో ఉన్నాయి. మరోవైపు బీడబ్ల్యూఎఫ్ రివైజ్డ్ షెడ్యూల్‌పై టాప్ షట్లర్లు సైనా, కశ్యప్, ప్రణీత్, ప్రణయ్ నిరాశ వ్యక్తంచేశారు. ఇంతవరకు ప్రాక్టీసే మొదలుపెట్టలేదని, అలాంటప్పుడు ఐదు నెలలో 22 టోర్నీలు ఎలా సాధ్యమవుతాయని విమర్శించారు.