సారథి న్యూస్, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్డౌన్ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్ షాపులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్ కోరారు.
- July 29, 2020
- Archive
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- KODAD
- LOCK DOWN
- కరోనా
- కోదాడ
- లాక్డౌన్
- Comments Off on ఆగస్టు 14 వరకు లాక్డౌన్