Breaking News

అవకతవకలపై విచారణ జరిపించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతమంది రైతులు, నిర్వాసితులకు నష్టపరిహారం అందించారో చెప్పాలన్నారు. అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.