సారథి న్యూస్, రంగారెడ్డి: ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు ఇతర అమర జవానులకు శనివారం నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ సచివాలయ నగర్ బస్టాప్ నుంచి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత కుంట్లూరు వెంకటేష్ గౌడ్, సచివాలయ నగర్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసరాజు, కుర్మారావు, శివ నాయక్, రఘునాయక్, బాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, క్యారం అసోసియేషన్ అధ్యక్షుడు ఓంప్రకాష్, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు బాలరాజు, కశ్యప్, వినోద్ నేత పాల్గొన్నారు.
- June 20, 2020
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- FRIENDS
- YOUTH
- ఎన్జీవోస్ కాలనీ
- వనస్థలిపురం
- సంతోష్‌బాబు
- Comments Off on అమర జవానులకు నివాళి