- కశ్యప్ కు ఆర్జీవి మద్దతు
ముంబై : లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు మద్దతు పెరుగుతోంది. కశ్యప్ తనకు 20 ఏళ్లుగా తెలుసనీ, కానీ అతడు అలాంటి వ్యక్తి కాదని ఆర్జీవి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు (అనురాగ్ కశ్యప్) చాలా సున్నిత మనస్కుడు. అతను ఎవరి మనసునైనా గాయపరిచినట్టు 20 ఏళ్లలో నేను ఇంతవరకూ వినలేదు, చూడలేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను’ అని రాసుకొచ్చారు. కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, లైంగిక వేధింపులకు గురిచేశాడని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అనురాగ్ అలాంటి వ్యక్తి కాదని అతని మాజీ భార్యలిద్దరితో పాటు అనుభవ్ సిన్హా, తాప్సీ వంటివాళ్లు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే.