![అధిరా లుక్స్ అదుర్స్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ADHIRAAAA.jpg?fit=700%2C525&ssl=1)
కేజీఎఫ్ 2లో ప్రధాన విలన్‌గా సంజయ్‌దత్ అధీరా రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో సంజయ్‌దత్ భయానకంగా కనిపిస్తున్నారు. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్ లుక్ క్రూషియల్‌గా ఉంది. ఆయన లుక్ చూసిన తర్వాత కేజీఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. ‘అధీరాను చూస్తే ఎవరైనా భయపడాలి. యువత ఆలోచనలకు అనుగుణంగా ఈ పాత్రను రూపొందించాం. అందుకనుగుణంగానే మేకప్ వేశాం’ అని వివరించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సంజయ్‌దత్‌కు మేకప్ వేయడానికి ఎంతో సమయం పట్టేది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.