రాయ్‌పూర్ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. బలోదబజార్ జిల్లాలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బలోదాబజార్ ఎస్పీ తెలిపారు. మే 31న నిందితులు వీడియో రికార్డు చేసి బాలికలను బెరించారని, అందువల్లే నేరం గురించి పోలీసులకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. జూలై 29న మైనర్ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- August 1, 2020
- Archive
- క్రైమ్
- జాతీయం
- GANGRAPE
- GIRL
- RAIPUR
- TRIPURA
- గ్యాంగ్‌రేప్
- లైంగికదాడి
- Comments Off on అక్కాచెల్లెళ్లపై 11 మంది గ్యాంగ్‌రేప్