Breaking News

సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సైబర్​నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్​కాల్స్, సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్​ను వాట్సప్​ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్​సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్​మెయిల్​చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నం.9121211100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.