సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారని గుర్తుచేశారు. రాజకీయల్లో తాము ఉన్నతంగా ఎదగడానికి ఇక్కడి పాత్రికేయులే కారణమన్నారు. సమాజహితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులకు అండగా ఉంటామన్నారు. అనంతరం జర్నలిస్టులు మంత్రి, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బి.అనిల్ కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లజుల వంశీ, కార్పొరేటర్లు ఇంజపూరి పులిందర్, పెంట రాజేష్, ఎన్వీ రమణరెడ్డి, బాల రాజ్ కుమార్, పాముకుంట్ల భాస్కర్, మేకల సదానందం, జనగామ కవిత సరోజీని, పలువురు నాయకులు పాల్గొన్నారు.
- January 9, 2021
- Archive
- Top News
- సాహితీలోకం
- CM KCR
- GODAVARIKHANI
- JOURNALIST
- KOPPULA ESHWAR
- కొప్పుల ఈశ్వర్
- జర్నలిస్టులు
- తెలంగాణ
- రామగుండం
- సీఎం కేసీఆర్
- Comments Off on తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం