Breaking News

జర్నలిస్ట్

  • ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా
    గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత,… Read more: ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

One thought on “జర్నలిస్ట్”

  1. 26/072024
    *PRESS NOTE*
    *అక్రమ కేసులపై వెల్గొండ గ్రామస్థుల ధర్నా*
    – ఇద్దరి విలేకరుల తీరుపై వేల్గొండ గ్రామస్థుల ధర్నా
    – విజయక్రాంతి, సామాజిక సారథిలపై చర్యలు తీసుకోండి
    – ఎస్సి ఎస్టీ కేసుల పేరుతో వసూళ్ళకి పాల్పడుతున్న గంగు ప్రకాష్, మల్లేష్ విలేకర్లు.

    బీజినేపల్లీ మండలానికి చెందిన సామాజిక సారథి విలేకరి గంగు ప్రకాష్, విజయక్రాంతీ పత్రిక విలేకరి మల్లేష్ లు బిజినేపల్లి ఎస్సై నాగశేఖర రెడ్డిపై ఒత్తిడి చేసి అమాయకపు వ్యక్తులపై ఎస్సి ఎస్టీ కేసులు పెట్టించి ఆర్థిక వసూళ్లకి పాల్పడుతున్నారని, వీరి అరచాకలను అరికట్టాలని వెల్గొండ గ్రామ ప్రజలమైన మేము డిమాండు చేస్తూ శుక్రవారం బిజనేపల్లీ మండల కేంద్రంలో ధర్నా చేపట్టాము. సామాజిక సారథి విలేకరి గంగు ప్రకాష్, విజయక్రాంతీ పత్రిక విలేకరి మల్లేష్ లు అమాయకులపై వార్తలు రాసి వారిపై పోలీస్ స్టేషన్ లో బలవంతపు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఇలాంటి విలేకరుల దుశ్చర్యలు వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించింది నేనే అని చెప్పుకుంటూ.. బిజినేపల్లీకి నేనే ఎమ్మెల్యే అంటూ గంగు ప్రకాష్ అనే వ్యక్తి చెప్పుకొని తిరుగుతూ పోలీసుల చేత అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. వీరు వేల్గొండ గ్రామానికి చెందిన గంగనమోని మల్లేష్, మోహన్ రెడ్డి, తిరుపాల్ అనే వ్యక్తులు అమాయక వ్యక్తులపై ఎస్సి, ఎస్టి కేసులు, మహిళలతో రేప్ కేసులు పెట్టించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. 15 రోజుల కింద వేల్గొండకు చెందిన మాజీ రౌడిషీటర్ బీరయ్యతో కలిసి అతని అన్న కుందేళ్ళ రాజుపై అక్రమ కేసు పెట్టించి అతని ఆత్మహత్యకి గంగనమోని మల్లేష్, మోహన్ రెడ్డి ,తీరుపాల్, సామాజిక సారథి విలేకరి గంగు ప్రకాష్, విజయక్రాంతి విలేకరి మల్లేష్ లు పరోక్షంగా కారణం అయ్యారు. వీరి దశ్చర్యలలో భాగంగా మా గ్రామానికి చెందిన కూన వెంకటేష్ అనే వ్యక్తిని కూన లక్ష్మమ్మ అనే మహిళతో ట్రాప్ చేయించి రేప్ కేసు పెట్టించడంతో నెల రోజులపాటు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అదే విధంగా గ్రామానికి చెందిన మధుసూదన్ అనే యువకుడిపై ఆ మహిళ చేత అక్రమ ఎస్సి, రేప్ కేసు పిర్యాదు చెపించారు. కేవలం పిర్యాదు ఆధారంగా సామాజిక సారథి విలేకరి గంగు ప్రకాష్, విజయక్రాంతి విలేకరి వార్తలు రాసి, వాటిని వైరల్ చేసి పోలీసులతో కేసు నమోదు చేసేలా కారణం అయ్యారు. ఇలాంటి వ్యక్తుల వలన మేము మా గ్రామంలో బయబ్రాంతులతో బతకాల్సి వస్తుంది. అక్రమ కేసులు పెట్టించడం నైజంగా మారిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేల్గొండ గ్రామ ప్రజలం స్వచ్చందంగా ధర్నా చేశాము. ఎస్సై నాగ శేఖరరెడ్డి హామీతో ఈ ధర్నాను విరమించుకున్నాము.

    ఇట్లు
    వేల్గొండ గ్రామ ప్రజలము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *