![కోహ్లీతో పోల్చవద్దు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/BABAR.jpg?fit=759%2C422&ssl=1)
కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ కూడా నన్ను గుర్తిస్తుంది. కోహ్లీతో పోల్చడం వల్ల అతని నీడలోనే ఉంటున్నట్లుగా ఉంది. దీనివల్ల క్రికెట్లో వెనుకబడిపోతున్నానని అనిపిస్తుంది’ అని బాబర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో బాబర్ అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ వన్డేల్లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే, టీ20ల్లో బాబర్ సగటున 50 కాగా, టెస్టుల్లో 45గా ఉంది. ఇక విరాట్ విషయాన్నికొస్తే మూడు ఫార్మాట్లలో 50 సగటు కలిగిన ఏకైక ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.