
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2011 క్రికెట్వరల్డ్కప్ సాధించి ఇండియాకు ఖ్యాతితెచ్చి పెట్టాడు. 2007లో టీ20 క్రికెట్ ప్రపంచ కప్ధోనీ నేతృత్వంలోనే వచ్చింది. కాగా, ధోనీ చివరిసారిగా 2019, జులై 19న వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. అయితే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కొనసాగుతున్న ధోనీ తన ఈ సీజన్లో సీఎస్కే తరఫున బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు.
అంతర్జాతీయ కెరీర్
90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 రన్స్ సాధించిన ధోనీ 350 వన్డే మ్యాచ్‌లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్ధ శతకాలు ఉన్నాయి. 183 వ్యక్తిగత అత్యధిక స్కోర్. ఇక 98 టీ-20 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 1600 పరుగుల సాధించాడు.
రికార్డులకు మారుపేరు
39 ఏళ్ల ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో పలు సంచలన రికార్డులను నెలకొల్పాడు. క్రికెట్లో భారత్‌ను ప్రపంచ నం.1 స్థానంలో నిలపడంలో ఈ రాంచీ డైనమెట్ కీలకపాత్ర పోషించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత శక్తివంతమైన బీసీసీఐని శాసించే స్థాయికి ఎదిగాడు. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, జట్టు సారథిగా ధోనీ టీమిండియా ఎన్నో విజయాలను తెచ్చిపెట్టాడు.