Breaking News

ఆదాయానికి మించి ఆస్తులు

మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్​లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన ఆయన పలు ల్యాండ్ సెటిల్​మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చారనే ఉన్నాయి. తన వాళ్లకు అన్ని పనులు చేసిపెట్టేవారని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేశారు.