సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్నగర్), వెంకటస్వామి (మహబూబ్నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.
- May 20, 2020
- క్రైమ్
- నల్లగొండ
- SLAB
- YADADRI
- కూలీలు
- యాదగిరిపల్లి
- Comments Off on స్లాబ్ కూలి.. గాయాలు