![సోనూభాయ్.. ‘ఆచార్య’ విలన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/sonu-f.jpg?fit=650%2C454&ssl=1)
తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి ఈ చిత్రంలో సోనూను విలన్ గా సంప్రదించినట్టు తెలుస్తోంది. సోనూ కి కూడా కథ నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పాడని అంటున్నారు. అయితే పరిస్థితులు చక్కబడ్డాకే షూటింగ్ మొదలవుతుందట.