– ఫూట్ పెట్రోలింగ్ తో పోలీస్ నిఘా
– ఎస్పీ కె.అపూర్వరావు
సారథి న్యూస్, జోగుళాoబ గద్వాల: ఏపీలోని కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జోగుళాoబ గద్వాల జిల్లా సరిహద్దుల వద్ద పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు.
శుక్రవారం తెలంగాణ, ఏపీ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్ట్ ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. చెక్ పోస్ట్ ల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అత్యావసర వైద్యసేవలు, నిత్యావసర సరుకుల ట్రాన్స్ పోర్టు వాహనాలు మినహా ఏ ఇతర వాహనాలకు అనుమతించకూడదని ఆదేశించారు. జోగుళాంబ గద్వాల జిల్లా -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ద్వారా పోలీస్ నిఘా పెంచామని తెలిపారు. డ్రోన్ కెమెరా ద్వారా పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది విధులను ఎస్పీ పర్యవేక్షించారు. ఆయన వెంట అలంపూర్ సీఐ వెంకట రామయ్య, శాంతినగర్ సీఐ జె.వెంకటేశ్వర్లు, ఉండవెల్లి ఎస్సై విజయ్ కుమార్, మనోపాడ్ ఎస్సై గురుస్వామి, శాంతినగర్ ఎస్సై శ్రీ హరి ఉన్నారు.