ఎన్ని సినిమాల ఫస్ట్ లుక్‌లు రిలీజవుతున్నా విక్రమ్ సినిమాల లుక్ లో ఉండే వేరియేషన్స్ ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. విక్రమ్, అజయ్ జ్ఞానముత్తుతో ‘కోబ్రా’ సినిమాను నిర్మిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాక్ డౌన్ కు ముందే ఫిబ్రవరిలో రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో చాలా రకాల గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్ ఫస్ట్ లుక్ లో ఎనిమిది గెటప్‌లను రివీల్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా ‘కోబ్రా’ సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ను మించి సెకెండ్ లుక్ ఉంది. పొడవైన జుట్టు, కళ్లజోడు, బేర్ బాడీతో ఒక వైపు భాగమంతా గజిబిజి అంకెలతో నిండిపోయి మ్యాథ్స్ మేధావిలా కనిపిస్తున్నాడు విక్రమ్. అంతేకాదు ‘ప్రతీ ప్రాబ్లమ్ కి మ్యాథమెటిక్ సొల్యూషన్ ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ను కూడా ఈ లుక్ కు యాడ్ చేశారు. లుక్కే ఇంత ఇప్రెసివ్ గా ఉంటే సినిమా ఇంకెంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో అంటున్నారు అభిమానులు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. కేఎస్.రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ మూవీ 2021 వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుంది.
- December 25, 2020
- Archive
- Top News
- సినిమా
- AR REHAMAN
- COBRA
- IRFANPATAN
- VIKRAM
- ఇర్ఫాన్ పఠాన్
- ఏఆర్ రెహమాన్
- కోబ్రా
- విక్రమ్
- Comments Off on విక్రమ్.. పెంటాస్టిక్ లుక్